తంజావూరులో విగ్రహాలు మాయం

3 Mar, 2018 10:39 IST|Sakshi

సాక్షి, తిరువొత్తియూరు: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తంజావూరు బృహదీశ్వర ఆలయంలో రాజరాజచోళన్, రాణి లోకమాదేవి కోట్ల విలువ చేసే బంగారం, పంచలోహ విగ్రహాలు అదృశ్యమైనట్లు తనిఖీల్లో తెలిసింది. రాష్ట్రంలోని పలు ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో విగ్రహాలు మాయం అవుతున్నాయి. వీటిపై ఫిర్యాదు అందడంతో మద్రాసు హైకోర్టు రాష్ట్రంలో విగ్రహాలకు సంబంధించి ఐజీ పొన్‌మాణిక్యవేల్‌ నేతృత్వంలో విగ్రహాల చోరీలపై విచారణ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ క్రమంలో విగ్రహాల తనిఖీ కోసం 250కు పైబడిన పోలీసులను నియమించారు. ఈ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన బృహదీశ్వర ఆలయంలో ఉన్న రాజరాజచోళన్, రాణి లోకమాదేవి బంగారు విగ్రహాలు అదృశ్యమై ఉన్నట్టు తెలిసింది. పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి ఆలయ నిర్వాహకులు జాయింట్‌ కమిషనర్‌ మాజీ కార్యదర్శులు సహా నలుగురిని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు