తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టు వార్నింగ్‌

2 May, 2019 15:41 IST|Sakshi

సాక్షి, చెన్నై : మద్రాసు హై కోర్టు.. తమిళనాడు ప్రభుత్వానికి  సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. నీటి నిల్వలను  పరిరక్షించేందుకు సీఎస్‌ అధ్వర్యంలో తక్షణమే ఓ కమిటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రజలు కట్టే సొమ్ముతో ఉచిత పథకాలు కాకుండా నీటి నిల్వలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటే మంచిది. ప్రభుత్వం ఇప్పటికైనా నీటి నిల్వలపై దృష్టి సారించకపోతే.. తమిళనాడు మరో దక్షిణాఫ్రికా అతుతుంద’ని కోర్టు హెచ్చరించింది. మంచినీటి కోసం ప్రజలు గొంతెండి బాటిళ్లు కొనుక్కునే దారుణమైన పరిస్థితి రానివ్వకండని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని వార్తలు