'ల్యాబ్ పరీక్షలో ఫెయిలైన మ్యాగీ'

8 Aug, 2015 12:23 IST|Sakshi
'ల్యాబ్ పరీక్షలో ఫెయిలైన మ్యాగీ'

లక్నో: మ్యాగీ శ్యాంపుల్స్ సురక్షితం కాదని మరో ల్యాబ్ పరీక్షలో తేలింది. మ్యాగీ శాంపిల్స్ను ల్యాబ్లో పరీక్షించగా, మోతాదుకు మించి సీసం వాడారని తేలినట్టు శనివారం ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ నిర్ణయించిన మోతాదుకన్నా సీసం మోతాదు ఎక్కువగా ఉందని ఆ అధికారి తెలిపారు. మ్యాగీ శాంపిల్స్ను పరీక్షించిన ల్యాబ్ రిపోర్టులను భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థకు పంపనున్నట్టు అడిషనల్ కమిషనర్(ఫుడ్)మౌర్యా పేర్కొన్నారు.

సీసం, మోనసోడియం(ఎంఎస్జీ) మోతాదుకు మించి మ్యాగీలో ఉన్నాయన్న ప్రాథమిక సమాచారం మేరకు ఉత్తర్ ప్రదేశ్ నలుమూలల నుంచి 500 శ్యాంపిల్స్ను సేకరించి ల్యాబ్లో పరీక్షించారు. వీటిలో 5శ్యాంపిల్స్లో మోతాదుకు మించి సీసంను అధికారులు గుర్తించారు. జూన్ 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మ్యాగీపై నిషేధం అమలులో ఉంది.

మరిన్ని వార్తలు