రాజ్భవన్ కింద అద్భుతం

17 Aug, 2016 09:16 IST|Sakshi
రాజ్భవన్ కింద అద్భుతం

ముంబయి: ఒకటి కాదు రెండు ఏకంగా 150 మీటర్ల పొడవైన పాతకాలం నాటి బంకర్ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు వెలికి తీశారు. రాజ్ భవన్ పరిసరాల్లో ఓ భారీ బంకర్ ఉందని ఆయనకు కొందరు పూర్వీకులు సమాచారం ఇచ్చిన మేరకు దీనిని వెలుగులోకి తెప్పించారు. ఆయన ఉంటున్న మల్బార్ హిల్స్లోని రాజ్భవన్ కింద దీనిని గుర్తించారు. సాధారణంగా ఉండే బంకర్లకంటే ఇది భిన్నంగా ఉంది. అతి పొడవుగా ఉండి చిన్నచిన్న గదులతో ఉన్న ఈ బంకర్ ఆశ్యర్యం గొలిపేలా ఉంది. దీనిని రెండు వైపులా 20 అడుగుల ఎత్తయిన తలుపులు ఉన్నాయి.

దీంతోపాటు దీనికి ప్రత్యేక మురుగనీటి పారుదల వ్యవస్ద లోపలికి వెళుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీనికి తూర్పు వైపు ఉన్న ద్వారాన్ని మూసి పశ్చిమ వైపు ద్వారం తెరిచారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిని మూసి దశాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరకుండా బంకర్ ఉండటం ఆశ్చర్యకరం.

గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర అధికారులు ఈ బంకర్ ను సందర్శించారు. ప్రత్యేక పురావస్తు అధికారులకు చెప్పి దాని సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తామని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. ఈ బంకర్ లో మొత్తం 13గదులు ఉన్నాయి. మొత్తం 5000 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. ఇందులో షెల్ స్టోర్, గన్ షెల్, కాట్రిజ్ స్టోర్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్ షాప్ వంటి రూములు ఇందులో ఉన్నాయి. దీనిని చక్కగా సంరక్షిస్తే మంచి పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చెందడం ఖాయం అని అధికారులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు