కేంద్ర కార్యాలయాల్లో మరాఠీ తప్పనిసరి!

6 Dec, 2017 17:32 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశంలో ప్రస్తుతం ప్రాంతీయోద్యమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రభుత్వం కార్యాలయాల్లో ప్రాంతీయ భాషను తప్పనిరి చేస్తూ ఆదేశాలు జరీ చేశాయి. తాజాగా ఈ కోవలోకి మహారాష్ట్ర వచ్చి చేరింది. రాష్ట్రంలోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కార్యయాల్లో ఇంగ్లీష్‌, హిందీతో పాటు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

బ్యాంకింగ్‌ సేవలు, పోస్టాఫీసులు, పెట్రోలియం, గ్యాస్‌, రైలు, టెలికమ్యూనికేషన్‌ కార్యాలయాల్లో మరాఠీని తప్పకుండా ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి త్రిభాషా సూత్రానికి అనుకుగణంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా వుండగా.. ఇప్పటికే మహారాష్ట్రలో మరాఠీ అధికార భాషగా ఉన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు