మహిళా కానిస్టేబుల్ లింగమార్పిడికి నో!

21 Nov, 2017 14:02 IST|Sakshi

సాక్షి, ముంబై : లింగ మార్పిడికి అనుమతించాలంటూ ఓ మహిళా కానిస్టేబుల్‌ దాఖలు చేసుకున్న అభ్యర్థనను మహారాష్ట్ర పోలీసులు తిరస్కరించారు. ఈ మేరకు సోమవారం ఔరంగబాద్‌ ఐజీపీ రాజ్‌కుమార్‌ వాట్కర్‌ ఆమెకు లేఖ రాశారు.

హర్మోనల్‌ మార్పుల కారణంగా ప్రస్తుతం ఆమె ట్రాన్స్‌జెండర్‌గా జీవించాల్సి వస్తోంది. సంఘం కూడా ఆమె పట్ల వివక్షత ప్రదర్శిస్తోంది. అందుకే ఆమె లింగ మార్పిడి కోరుకుంటోంది. అంగీకరించండి. అని ఆమె తరపున న్యాయవాది డాక్టర్‌ ఎజాజ్‌ అబ్బాస్‌ జౌరంగబాద్‌ ఐజీపీకి అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేశారు. 

అయితే పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నియామవళి ప్రకారం.. కానిస్టేబుల్‌ పురుష అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ. ఉండాల్సి ఉంది. అయితే 2009లో కానిస్టేబుల్‌గా చేరిన సదరు మహిళ ఎత్తు 162.5 మాత్రమే. దీంతో ఆమెను అనుమతించటం కుదిరే పని కాదంటూ అభ్యర్థనను పోలీస్‌ శాఖ తిరస్కరించారు.  ఈ అంశంపై న్యాయపోరాటానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు అబ్బాస్‌ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు