అధికారిక కార్యకలాపాల్లో మరాఠి తప్పనిసరి

1 Jul, 2020 10:48 IST|Sakshi

ఆదేశాలు జారీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే సర్కారు

ముంబై: మాతృభాష మరాఠికి పెద్దపీట వేయాలని మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు నిర్ణయించుకుంది. అన్ని రకాల అధికారిక కార్యకలాపాల్లో మరాఠి వాడుకను తప్పనిసరి చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మరాఠీని ఉపయోగించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. (కరోనా కల్లోలం.. పెరుగుతున్న మరణాలు)

ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్​లో ‘మరాఠిని వాడటంలో విఫలమైన వారి సర్వీస్ బుక్‌లో నెగెటివ్ మార్క్స్ వేస్తాం. వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలిపేస్తాం’ అని వెల్లడించింది. మరాఠి వాడుకను తప్పనిసరి చేస్తూ గతంలో అనేక సర్క్యులర్లను జారీ చేశామని, అయినప్పటికీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం ఆంగ్లాన్నే వాడుతున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. (పెరిగిన వంట గ్యాస్ ధర)

ఇంగ్లీషు వాడుక వల్ల సామాన్యులకు, సర్కారుకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తోందని మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. అధికారిక ఉత్తర్వుల్లో మరాఠిని ఉపయోగిస్తే, ప్రభుత్వ పథకాలను ప్రజలు బాగా అర్థం చేసుకుని, ప్రయోజనం పొందుతారని తెలిపింది.

మరిన్ని వార్తలు