గవర్నర్ బదిలీ వివాదం..

24 Aug, 2014 22:48 IST|Sakshi

 ముంబై: హఠాత్తుగా మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్‌ను మిజోరామ్‌కు బదిలీ చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించింది. అయితే బదిలీ వెనుక చాలా కారణాలు ఉన్నాయని, అందులో ముఖ్యమైనది.. చవాన్ మోడీ సభకు నో చెప్పడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. నాగపూర్‌లో శనివా రం ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాలను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ బహిష్కరించారు. దీనికి కొన్ని రోజు ల ముందు షోలాపూర్‌లో ప్రధాని మోడీ హాజరైన సభలో చవాన్‌కు అవమానం జరిగింది.

ముఖ్యమంత్రి ప్రసంగాన్ని కొందరు అడ్డుకున్నారు. ఆ సమయంలో మోడీ కూడా వారిని వారించే ప్రయత్నించలేదని పేర్కొంటూ అధికార పక్షం కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం, అధికారులు నాగపూర్ సభకు గైర్హాజరయ్యారు. మహారాష్ట్రతోపాటు కాశ్మీర్, హ ర్యానా, జార్ఖండ్‌లోనూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. యూపీ ఏ ప్రభుత్వం నియమించిన డజను గవర్నర్లలో శం కరనారాయణన్ ఒకరు. అయితే మోడీ నేతృత్వం లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక రూపొందించిన హిట్‌లిస్టులో శంకరనారాయణన్ పేరు కూడా ఉంది.

ఒకటి, రెండు నెలల్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గవర్నర్ మార్పిడిపై ఎన్డీయే ప్రభుత్వం దృష్టి సారించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. దీంతో గవర్నర్ పదవికి రాజీ నామా చేయాల్సిందిగా గత నెలే కేంద్రం నుంచి శంకరనారాయణన్‌కు ఆదేశాలు అందినా, ఆయన ససేమిరా అన్నారు. దీంతో ఇక మోడీ ప్రభుత్వం ఆయన జోలికి రాదేమోనని అంతా భావించారు. ఈ నేపథ్యంలో గత వారం చవాన్ మోడీ సభను బహిష్కరించడం వల్ల గవర్నర్ బదిలీకి అవకాశాలు ఎక్కువయ్యాయని భావిస్తున్నారు. కేంద్రంలో కొత్త పార్టీలు అధికారంలోకి వస్తే ప్రతిపక్షాలకు చెందిన గవర్నర్లపై దృష్టి సారించడం మామూలే.
 
ఈ నేపథ్యంలో శంకరనారాయణన్ రెండు ఎంపికలు మిగిలాయి మొదటిది: పదవికి రాజీ నామా చేయడం.
 రెండోది : మూడేళ్లపాటు మిజోరామ్ గవర్నర్‌గా కొనసాగడం. అయితే ఆయన మొదటిదానికే సిద్ధపడి రాజీనామా సమర్పించారు. మహారాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓంప్రకాశ్ కోహ్లీకి బాధ్యతలను అప్పగించిన తరువాతే శంకరనారాయణన్‌ను బదిలీ చేశారు. అంతేగాక ఆదివారం సాయంత్రం కోహ్లీ ప్రమాణ స్వీకారానికి సీఎం చవాన్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు కూడా. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన శంకరనారాయణన్ బదిలీపై 2010లో మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

2012లో ఆయన పదవీకాలాన్ని రెండోసారి పొడగించారు. ఇంతకుముందు ఆయన జార్ఖండ్, నాగాలాండ్ గవర్నర్లుగా పనిచేశారు. మృదుస్వభావిగా పేరున్న ఈ కేరళవాసి అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడమేగాక, వివాదాలకూ దూరంగా ఉన్నారు. రాజీమా నాపై ఆదివారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన క్లుప్తంగా జవాబు చెప్పారు. ‘పదవిలో ఉన్నప్పుడు నేను రాజకీ యాలకు పాల్పడలేదు. అన్ని పార్టీలతో స్నేహంగా ఉన్నాను. నాతో రాజీ నామా ఎందుకు చేయించారో కారణాలు మీకు తెలుసు’ అని ముగించారు.


 ఇక ఓం ప్రకాశ్ కోహ్లీ ప్రమాణ స్వీకారం కోసం ఆది వారమే కుటుంబ సమేతంగా రాజ్‌భవన్‌కు చేరు కున్నారు. ఆయనకు పోలీసులు గౌరవ వంద నం సమర్పించారు. ఈ వివాదంపై మహారాష్ట్ర కాంగ్రెస్ స్పందిస్తూ రాజ్యాంగ పదవుల గౌరవాన్ని తగ్గిం చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇదని విమర్శించింది.

మరిన్ని వార్తలు