మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

28 Feb, 2020 14:55 IST|Sakshi

ముంబై : మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లుకు ఉద్ధవ్‌ థాక్రే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును శాసన సభలో ప్రవేశపెడుతామని మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి నవాబ్‌ మాలిక్‌ శుక్రవారం తెలిపారు. ఉద్యోగాల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై ఆలోచిస్తున్నామని, దానికి సంబంధించి న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల వల్ల గత ప్రభుత్వం ఉద్యోగ రిజర్వేషన్లపై వెనకడుగు వేసిందని ఆయన గుర్తు చేశారు. కాగా, బీజేపీ-శివసేన మధ్య ప్రభుత్వ ఏర్పాటు చెడటంతో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మహా వికాస్‌ అఘాడీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఎన్సీపీ ఎమ్మెల్యే.

మరిన్ని వార్తలు