కేరళ వరదలు: సెక్స్‌ వర్కర్ల సాయం

21 Aug, 2018 19:54 IST|Sakshi

ముంబై : కేరళ వరద బాధితులకు మహారాష్ట్ర సెక్స్‌ వర్కర్లు సాయం చేశారు. అహ్మద్‌ నగర్‌ జిల్లాకు చెందిన సెక్స్‌వర్కర్లు రూ.21వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. నెలాఖరువరకు ఈ సాయాన్ని లక్షకు పెంచుతామని కూడా తెలిపారు. ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా బాధితులకు అందజేయాలని చెక్కును స్థానిక డిప్యూటీ కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌కు అందజేశారు. ఈ విషయాన్ని సెక్సవర్కర్ల సంక్షేమం కోసం పనిచేసే ఓ ఎన్జీవో ప్రతినిధి తెలిపారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించనప్పుడల్లా సెక్స్‌వర్కర్లు సాయం చేశారని ఆయన పేర్కొన్నారు.

2015లో చెన్నై వరద బాధితులకు ఒక లక్ష సాయం చేసారని చెప్పారు. ఇప్పటి వరకు సెక్స్‌వర్కర్లు మొత్తం రూ. 27 లక్షల సాయాన్ని చేసినట్లు పేర్కొన్నారు. 2001లో గుజరాత్‌లో భూకంపం, సునామీ (2004), కశ్మీర్‌, బీహార్‌ వరదలు, మహరాష్ట్రలోని కరువు సంభవించినప్పుడు, కార్గిల్‌ హీరోలకు విరాళాలు ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు. సాయం చేసిన సెక్స్‌ వర్కర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
 

మరిన్ని వార్తలు