సైక్లోన్‌ అలర్ట్‌ : బీచ్‌ల మూసివేత

12 Jun, 2019 20:22 IST|Sakshi

ముంబై : అరేబియా సముద్రం తీరంలో వాయు తుపాన్‌  ప్రభావంపై మహారాష్ట్ర అప్రమత్తమైంది. కొంకణ్‌ ప్రాంతంలోని పాలఘర్‌, థానే, ముంబై, రాయ్‌గఢ్‌, రత్నగిరి, సింధుదుర్గ్‌లోని అన్ని బీచ్‌లను మూసివేయాలని, ఆయా బీచ్‌ల్లోకి రానున్న రెండు రోజుల్లో ప్రజలను అనుమతించరాదని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

వాయు తుపాన్‌ ప్రభావంతో గురువారం ఉదయం నుంచే సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని, తుపాన్‌ ప్రభావంతో మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయు తుపాన్‌ గురువారం గుజరాత్‌ తీరంలో పోర్‌బందర్‌, దియూల మధ్య తీరం దాటుతుందని, ఈ సమయంలో గంటకు 145 నుంచి 155 కిమీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది.

>
మరిన్ని వార్తలు