70ఏళ్ల తర్వాత ఆ ఊళ్లో వెలుగులు..

15 Apr, 2018 12:30 IST|Sakshi

అమ్రావతి, మహారాష్ట్ర : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మన దేశంలో విద్యుత్‌ వెలుగులకు నోచుకోని గ్రామాలెన్నో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం  ప్రతి గ్రామానికి విద్యుత్‌ అందించే లక్ష్యంతో ‘ప్రధాన మంత్రి సహజ్ బిజ్లి హర్ ఘర్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం ద్వారా మహారాష్ట్రలోని అమ్రావతి సమీపంలో ఉన్న బులుమ్‌గవ్‌హన్ అనే గిరిజన గ్రామంలో విద్యుత్‌ సదుపాయాన్ని కల్పించారు. దీంతో ఆ గిరిజన గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది.

బులుమ్‌గవ్‌హన్‌ గ్రామంలో 589 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరికి రోడ్లు, విద్యుత్తు, వైద్యం వంటి కనీస సదుపాయాలూ అందుబాటులో లేవు. తాజాగా ప్రభుత్వ యంత్రాంగం, గ్రామస్థులు కలసి సమష్టిగా కృషి చేసి, విద్యుత్‌ సరఫరాను అందుబాటులోకి తేగలిగారు. దీంతో గ్రామస్తులంతా సంబరాలు చేసుకుంటున్నారు. కరెంటు లేక తమ పిల్లలు ఇన్ని రోజులు చదువుకోలేదని ఇక ఆ బాధ లేదని గ్రామస్తులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు