కేర‌ళ ఆఫ‌ర్‌కు ఓకే చెప్పిన 'మ‌హా' స‌ర్కార్

25 May, 2020 16:06 IST|Sakshi

ముంబై : మ‌హారాష్ర్ట‌లో క‌రోనా మృత్యు ఘంటిక‌లు మోగిస్తున్న వేళ‌..కోవిడ్ రోగుల‌కు చికిత్స అందించ‌డానికి అత్య‌వ‌స‌రంగా వైద్య‌లను పంపాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వాన్ని  కోరింది. దేశంలో అత్య‌ధికంగా కోవిడ్ కేసులు వెలుగుచూస్తుండ‌టం, వైద్య సిబ్బంది కొర‌త ఏర్ప‌డింది. దీంతో శిక్ష‌ణ పొందిన 50 మంది స్పెష‌లిస్ట్ వైద్యులు, 100 మంది న‌ర్సుల‌ను వెంట‌నే రాష్ర్టానికి పంపిల్సిందిగా కేర‌ళ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది.
(లాక్‌డౌన్‌తో సాధించిన ఫలితాలేమిటి? )

అయితే మ‌హారాష్ర్ట‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో అంత‌కుముందే కేర‌ళ‌.. మా ద‌గ్గ‌ర త‌గినంత వైద్య సిబ్బంది ఉన్నారు. మీకు కావాలంటే వెంట‌నే స‌హాయం అందిస్తాం అని పేర్కొంది. దీంతో మ‌హా స‌ర్కార్ అధికారిక లేఖ ద్వారా వైద్య‌లను పంప‌మ‌ని కోర‌గా, వెంట‌నే కేర‌ళ ప్ర‌భుత్వం దానికి అంక‌రించింది. ఆదివారం నాటికి మ‌హారాష్ర్ట‌లో 3,041 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడ‌గా, 58 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హారాష్ర్ట‌లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసులు 50,231 ఉండ‌గా, ప్ర‌స్తుతం 33,988 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ర్టంలో ఇప్పటివ‌ర‌కు 14,600 మంది వైర‌స్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్లు వైద్య ఆరోగ్య శాక వెల్ల‌డించింది.

మరిన్ని వార్తలు