అదే చైనా వ్యూహం: జిజి ద్వివేదీ

18 Jun, 2020 12:25 IST|Sakshi

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ ఏ నిర్మాణమూ చేపట్టకుండా చూడటం, లద్దాఖ్‌ను సొంతం చేసుకోవటమే చైనా లక్ష్యమని భారత సైన్యపు మాజీ మేజర్‌ జనరల్‌ జిజి ద్వివేదీ వ్యాఖ్యానించారు. చైనా ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైప కొంచెం కొంచెంగా భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేస్తోందని అన్నారు. బుధవారం జిజి ద్వివేదీ మీడియాతో మాట్లాడుతూ.. చైనా, భారత్‌తో గొడవ పెట్టుకోవటానికి గల ఉద్దేశ్యాన్ని వివరించారు. చైనా నిర్లక్ష్యం కారణంగానే ప్రపంచ దేశాలకు కరోనా విస్తరించిందన్న అమెరికా వాదనలకు భారత్‌ వంతపాడటమే ఇందుకు కారణమన్నారు. సైనిక బలంతో రాజకీయ లక్ష్యాలను సాధించటమే కాకుండా భారత భూభాగాన్ని సొంతం చేసుకోవటమే చైనా వ్యూహంగా పేర్కొన్నారు. ( చైనా వాదనలపై అనురాగ్‌ శ్రీవాస్తవ ఫైర్‌!)

ఆయన కమాండర్‌గా పనిచేసిన 1992నాటి కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుంటూ..‘‘ అప్పుడు ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. మేము.. మాలాగే వాళ్లు కూడా హాట్‌ స్ప్రింగ్స్‌ వరకు పాట్రోలింగ్‌ చేసుకునే వాళ్లం. లద్దాఖ్‌లోని భారత సైన్యం గాల్వన్‌ లోయను పర్యవేక్షించేది. వారికప్పుడు ఏలాంటి సమస్యా ఎదురుకాలేదు. ఆ సమయంలో చైనా సైన్యం అక్కడి రాళ్లపై ‘‘ చుంగ్‌ కో( ఇది చైనా)’’ అని రాశారు. వెంటనే భారత సైనం వాటిని చెరిపేసి ‘ఇది భారత్‌’ అని రాసింది’’ అని చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు