దేశంలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు

11 Sep, 2018 16:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ వద్ద జరిగిన ఆర్టీసి బస్సు ప్రమాదంలో 50 మంది దుర్మరణం పాలైన విషయంతెలిసిందే. కొండగట్టు బస్సు ప్రమాదం దేశ చరిత్ర అతిపెద్ద ప్రమాదం. ఇంత వరకు ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగిన బస్సు ప్రమాదం దేశంలో ఎక్కడా జరగలేదు. ఈ సందర్భంగా దేశంలో జరిగిన అతిపెద్ద రోడ్డు ప్రమాదాల వివరాలు ఒక సారి పరిశీలిద్దాం.

తెలంగాణ
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ వద్ద జరిగిన ఆర్టీసి బస్సు ప్రమాదంలో 50 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మరింత మంది ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

హిమాచల్‌ ప్రదేశ్‌
సిమ్లా వద్ద బస్సు లోయలో పడిపోవడంతో 51 మంది ప్రయాణికులు మరణించారు. 15మందికిపైగా ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో రోడ్డు చాలా వరకు ఘాట్‌ రోడ్డు ఉండడంతో పెద్ద ప్రమాదాలే జరిగాయి.

జమ్మూ కశ్మీర్‌
కశ్మీర్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 51 మంది మరణించారు. మరికొంత మంది ఆచూకి లభించలేదు.

గుజరాత్‌
గుజరాత్‌లోని వడోదరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 47 మంది దుర్మరణం పాలైయ్యారు. గుజరాత్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద రోడ్డు ప్రమాదం.

తెలంగాణ
మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద సంభవించిన బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం. బస్సు కల్వర్డును ఢీ కొట్టడంతో పెట్రోల్‌ ట్యాంక్‌ లీకవ్వడంతో సెకన్లపాటు సమయంలోనే బస్సులో పూర్తిగా మంటలు వ్యాపించడంతో 45 మంది సజీవదహనమయ్యారు.

జమ్మూ కశ్మీర్‌
జమ్మూ కశ్మీర్‌లో 2008లో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 370 మీటర్ల ఎత్తునుంచి చినాబ్‌ నదిలోకి పడిపోవడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇలాంటి ప్రమాదాల కశ్మీర్‌లో చాలానే జరిగాయి. లోయప్రాంతం కావడంతో ప్రయాదాలు జరగడం సాధారణంగా మారింది.

మహారాష్ట్రా
మహారాష్ట్రాలో 2008లో జరిగిన బస్సు ప్రమాదంలో 39 మంది ప్రయాణికులు మరణించారు. నాసిన్‌కు భక్తులతో  వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 39 మంది భక్తులు చనిపోగా.. 40 మంది గాయాలతో బయటపడ్డారు.

ఉత్తరాఖండ్‌
ఉత్తరాఖండ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 36 మంది భక్తులు మరణించారు. నేపాల్‌కి చెందిన భక్తులు ప్రైవేటు వాహనంలో వెళ్తుండగా బస్సు ఆలకనందా నదిలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

తెలంగాణ
మూసాయిపేట వద్ద జరిగిన బస్సు-రైలు ప్రమాదంలో 26 మంది స్కూల్‌ విద్యార్ధులు మృతి చెందారు. ప్రమాదంలో చనిపోయినవారంతా పది నుంచి పదిహేనేళ్లలోపు వారే. బస్సు పాఠశాలకు వెళ్తుండగా రైల్వే లెవలింగ్‌ క్రాస్‌ లేకపోవడంతో ప్రమాదం జరిగింది.

ఉత్తరాఖండ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. బస్సు కొండపై నుంచి లోయలోకి పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

బిహార్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మృతి చెందారు.

మరిన్ని వార్తలు