నేటి ముఖ్యాంశాలు..

14 Jun, 2020 06:13 IST|Sakshi

నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం

♦ ప్రపంచ వ్యాప్తంగా 78.54 లక్షలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.31 లక్షల మంది మృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 40.17 లక్షల మంది

ఢిల్లీ: నేడు కేంద్రహోం మంత్రి అమిత్‌ షాతో  సీఎం కేజ్రీవాల్‌ భేటీ

♦ నేడు తెరచుకోనున్న శబరి ఆలయం
నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరవనున్న అధికారులు
భక్తులకు అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేసిన కేరళ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌:
అనంతపురం: దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలను జడ్జి ముందు హాజరుపర్చిన పోలీసులు
14రోజుల రిమాండ్‌ విధింపు, కడప సెంట్రల్‌ జైలుకు తరలింపు

విశాఖపట్నం: నైరుతి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం

♦ నేడు తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం

తెలంగాణ:
♦ ఈ నెల 16న కలెక్టర్లతో కేసీఆర్‌ భేటీ
వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామి పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు