నేటి విశేషాలు...

22 Mar, 2020 05:47 IST|Sakshi

జాతీయం
నేడు జనతా కర్ఫ్యూ
దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా స్వచ్ఛంద బంద్‌
అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్‌
ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధానమంత్రి

నేడు తెల్లవారుజామున నుంచి 29వరకు అంతర్జాతీయ విమానాల నిలిపివేత
విదేశాల నుంచి టేకాఫ్‌ తీసుకునే విమానాలకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌ ఉండదని డీజీసీఏ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌
నేడు రాష్ట్రవ్యాప్తంగా 'డ్రై డే' అమలు
జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 'డ్రై డే' అమలు చేయాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది.
నేటి నుంచి 31వరకు వాణిజ్య సముదాయాలు బంద్‌

తెలంగాణ
జనతా కర్ఫ్యూలో భాగంగా తెలంగాణలో ఆదివారం ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపు

నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

నేడు హెచ్‌బీసీ బైక్‌ స్టేషన్‌ మూసివేత 
రాయదుర్గం: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌ బైసైక్లింగ్‌ క్లబ్‌ బైక్‌ స్టేషన్లను మూసివేస్తున్నట్లు హెచ్‌బీసీ మేనేజర్‌ శ్రావణ్‌ తెలిపారు. బైక్‌ స్టేషన్లు ఆదివారాల్లో రైడర్లకు అందుబాటులో ఉండేవనీ, ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్‌బీసీ పాలకమండలి ఆదేశాలపై గచ్చిబౌలి, నెక్లెస్‌రోడ్డులోని బైక్‌ స్టేషన్లను ఆదివారం మూసివేస్తున్నామన్నారు. రేపటి (సోమవారం) నుంచి యథాప్రకారం బైక్‌స్టేషన్లు అందుబాటులో ఉంటాయనీ, వినియోగదారులు గమనించాలన్నారు.    

‘సండే ఈవినింగ్‌ టాక్‌’ రద్దు 
రాయదుర్గం: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే ‘సండే ఈవినింగ్‌ టాక్‌’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు శనివారం తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సండే ఈవినింగ్‌ టాక్‌ను నిర్వహించడం గత కొన్నాళ్లుగా ఆనవాయితీగా వస్తున్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదే విధంగా చిన్నారుల కోసం ఆదివారం సాయంత్రం నిర్వహించే బాలబృందావనం కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 

‘తెలుగు’ వేడుకలు రద్దు 
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లిహిల్స్‌లోని స్పైస్‌ అవెన్యూ రెస్టారెంట్‌ ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా  సంప్రదాయబద్ధంగా నిర్వహించే  తెలుగోత్సవం వేడుకలను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అయితే కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతం వేడుకలను రద్దు చేస్తున్నామని, కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

మలక్‌పేటగంజ్‌ బంద్‌ 
చాదర్‌ఘాట్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మలక్‌పేట హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్టు మార్కెట్‌ చైర్మన్‌ సీహెచ్‌.రాధ శనివారం ప్రకటించారు. మార్కెట్‌ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 22 నుంచి 25 వరకు ఉల్లిగడ్డల మార్కెట్‌ను బంద్‌ చేయడం జరుగుతుందని, అదే విధంగా మార్కెట్‌ లావాదేవీలు ఏప్రిల్‌ 2 వరకు నిలిపివేయబడుతాయన్నారు. మిర్చి,చింతపండు కార్యకలాపాలు కూడా నిలిచిపోతాయని తెలి పారు. రైతులు,వ్యాపారులు ఇందుకు సహకరించాలనికోరారు. ఆన్‌లైన్‌ద్వారా మాత్రమే డబ్బు చెల్లించాలని సూచించారు. మార్కెట్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ శానిటైజేషన్‌ లిక్విడ్‌ వాడడం, మాస్కులు ధరించడం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి షాప్‌లో శానిటైజేషన్‌ లిక్విడ్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మార్కెట్‌ కమిటీ డైరెక్టర్స్, కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. 

ఇంటి యజమానుల సమావేశం వాయిదా 
నల్లకుంట : జనతా కర్యూ్ఫ నేపథ్యంలో ఆదివారం నిర్వహించాల్సిన నల్లకుంట డివిజన్‌ రత్నానగర్‌ బస్తీ ఇంటి యజమానుల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు రత్నానగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రకటించారు. కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు నగరంలో సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేయడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రతినిధులు తెలిపారు. బస్తీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బస్తీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.ఈశ్వర్, ఉపాధ్యక్షుడు బి.రాము యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎంబీ. కిశోర్‌ కుమార్, సంయుక్త కార్యదర్శి టి. వీరయ్య గౌడ్, కోశాధికారి ఎం.సతీష్‌ చంద్ర గౌడ్‌ మాట్లాడారు. కోవిడ్‌ వైరస్‌ అదుపులోకి వస్తే సర్వసభ్య సమావేశం తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. ఈ అసౌకర్యాన్ని బస్తీ వాసులు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బస్తీ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు మహ్మద్‌ జహీర్‌ పాష, ఆర్‌.రాజు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు