నేటి విశేషాలు..

9 Nov, 2019 08:21 IST|Sakshi

► దశాబ్దాల నాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు నేడు  తీర్పు చెప్పనుంది. శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌​ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా.. రెండు దేశాలను కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ శనివారం ప్రారంభం కానుంది. పాక్‌లోని నరోవల్‌ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును ప్రధాని మోదీ నేడు ప్రారంభిస్తారు. సిక్కుల గురువు గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.

► నేడు ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికులు శనివారం నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించడం, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామంటూ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హైదరాబాద్‌ నగరంలో నేడు
ఆర్య జనని: గర్భిణులకు ప్రత్యేక శిక్షణ -వేదిక: రామకృష్ణమఠం, దోమలగూడ -సమయం: ఉ. 9నుంచి 12.30 వరకు 

► మాయా బజార్‌ నాటక ప్రదర్శన  -వేదిక: సురభి థియేటర్, పబ్లిక్‌ గార్డెన్స్, -సమయం: సాయంత్రం 6.30 గంటలకు  

కూచిపూడి డ్యాన్స్‌ బై వర్మఆర్ట్స్‌ అకాడమీ  -వేదిక: రవీంద్ర భారతి, లక్డీకాపూల్‌  -సమయం: సాయంత్రం 5  గంటలకు  

► ధ్రుపద్‌ సంధ్య – అశ్లేష షైన్‌ట్రీ  -వేదిక: భాస్కర అడిటోరియం, -బిర్లా సైన్స్‌ మ్యూజియం ఆవరణ -సమయం: సాయంత్రం 6 గంటలకు  

నవరసాస్‌ – భరతనాట్యం రెకిటల్‌ భై జనని సేతునారాయణన్‌  -వేదిక: లమాకాన్‌ , బంజారాహిల్స్‌  -సమయం: రాత్రి 7–30 గంటలకు  

► ఆ పాత సినీ మధుర గీతాలు  -వేదిక: త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి  -సమయం: సాయంత్రం 5–30 గంటలకు  

కాంటెపరరీ డ్యాన్స్‌ క్లాసెస్‌  -సమయం: ఉదయం 11 గంటలకు  – లాటిన్‌ డ్యాన్స్‌ సల్సా క్లాసెస్‌  -సమయం: సాయంత్రం 6 గంటలకు  

► ఎల్డర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వరల్డ్‌ లీగల్‌ సర్వీసెస్‌ డే  సందర్భంగా ‘సత్వర న్యాయం –ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కార మార్గాలు’  -వేదిక: రామానుజచారి ఏసీఅడిటోరియం, -మహేశ్వరీ కాంప్లెక్స్‌, మాసబ్‌ ట్యాంక్‌  -సమయం: ఉదయం 9–30 నుంచి  మధ్యాహ్నం 12–30 వరకు  

ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ సుపర్ణ గుహ  -వేదిక: బుక్స్‌ ఎన్‌ మోర్‌ –లైబ్రరీ అండ్‌ ఆక్టీవిటీ సెంటర్‌, వెస్ట్‌ మారేడ్‌పల్లి  -సమయం: సాయంత్రం 5 గంటలకు  

► స్టాండప్‌ కామెడీ బై మనోజ్‌ ప్రభాకర్‌  -వేదిక: హార్ట్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌  -సమయం: రాత్రి 7–30 గంటలకు  

కార్నాటిక్‌ ఓకల్‌ అండ్‌ కూచిపూడి డ్యాన్స్‌ బై మంథాస్‌ రాగాలయ అకాడమీ  -వేదిక: శిల్పారామం, ఉప్పల్‌  -సమయం: రాత్రి 7–30 గంటలకు  

► స్టాండప్‌ కామెడీ బై రాజశేఖర్, సందేశ్‌  -వేదిక: ఫోనెక్స్‌ ఎరీనా, గచ్చిబౌలి  -సమయం: రాత్రి 7 గంటలకు  

ఆది ధ్వని అపురూపమైన అంతరించిపోతున్న సంగీత వాద్య ప్రదర్శన  -వేదిక: స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ, మాదాపూర్‌  -సమయం ఈ నెల 9 నుండి 13 వ తేది వరకు సాయంత్రం 4–30 గంటలకు  

మరిన్ని వార్తలు