షాకింగ్‌ : మూడు లక్షల ఉద్యోగాలకు ఎసరు

30 Jul, 2019 09:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలు భారీ లేఆఫ్స్‌కు రంగం సిద్ధం చేశాయి. మూడు లక్షల మంది ఉద్యోగులను  స్వచ్ఛంద పదవీవిరమణ చేయాలని రైల్వేలు కోరనున్నాయి. 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులను తమ స్ధానాల నుంచి వైదొలగాలని కోరవచ్చని భావిస్తున్నారు. ఈ దిశగా అన్ని జోనల్‌ చీఫ్స్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డులు ఉద్యోగుల సామర్ధ్యంపై నివేదికను కోరుతూ లేఖ రాశాయి. 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరితో పాటు 2020 తొలి క్వార్టర్‌లో 30 ఏళ్ల సర్వీస్‌ను పూర్తిచేసుకున్న వారి జాబితాను సమర్పించాలని కోరాయి.

ఉద్యోగుల సామర్ధ్యంపై సమీక్ష నిర్వహించి దాని ఆధారంగా సర్వీస్‌ రికార్డును తయారుచేయాలని జోనల్‌ మేనేజర్లకు రైల్వే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఉద్యోగుల శారీరక, మానసిక ఫిట్‌నెస్‌, రోజూ విధులకు హాజరయ్యే రికార్డు, క్రమశిక్షణ ఆధారంగా సామర్ధ్య సమీక్షను చేపడతారు. ఆగస్ట్‌ 9 నాటికి ఉద్యోగులకు సంబంధించిన నివేదికలను తమకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కళంకిత అధికారులను సాగనంపే ప్రక్రియను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టడంతో ఆ కోణంలోనూ రైల్వే ఉద్యోగుల్లో వడపోతలు ఉంటాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు