డ్రగ్స్‌ రాకెట్‌లో నలుగురు విద్యార్థుల అరెస్ట్‌

30 Dec, 2017 15:57 IST|Sakshi

న్యూ ఢిల్లీ : న్యూ ఇయర్‌ వేడుకలకు ముందు దేశ రాజధానిలో డ్రగ్స్‌ రాకెట్‌ ముఠాతో సంబంధం ఉన్న నలుగురు విద్యార్థులను నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబి) అరెస్ట్‌ చేసింది. నిందితుల నుంచి 1.14 కిలోల గంజాయితో పాటు ఎల్‌ఎస్‌డీ పేపర్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో న్యూ ఇయర్‌ వేడుకలకు డ్రగ్స్‌ పంపిణీ చేయబోతున్నట్టు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు.

ఎన్‌సీబి డిప్యూటీ జనరల్‌ డైరక్టర్‌ ఎస్‌కె జా మాట్లాడుతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో డ్రగ్స్‌ వాడకం ఇటీవల ఎక్కువ అయిందని తెలిపారు. హిమచల్‌ ప్రదేశ్‌ నుంచి వీరికి డ్రగ్స్‌ సరఫర అవుతున్నాయన్నారు. హిందు కాలేజీకి చెందిన గౌరవ్‌ ఈ రాకెట్‌ని కింగ్‌పిన్‌ అనే కోడ్‌తో రన్‌ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతని నుంచి మిగిలిన ముగ్గురికి(అనిరుధ్‌ మాథుర్‌, టెన్జిన్‌ ఫుంచోగ్‌‌, సామ్‌ మల్లిక్‌) డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయని, వారు చెప్పిన వివరాల ప్రకారం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు