యూపీలో ఒక్కో ఓటుకు ఎంతపెట్టారంటే..

17 Mar, 2017 15:12 IST|Sakshi
యూపీలో ఒక్కో ఓటుకు ఎంతపెట్టారంటే..

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఎంత డబ్బును ఆయా పార్టీలు ఖర్చు చేశాయో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5,500కోట్లను యూపీ ఎన్నికల్లో అడ్డగోలుగా వెదజల్లినట్లు ఓ ఎన్నికల సర్వే తెలిపింది. వీటిల్లో దాదాపు రూ.1000కోట్లు ఓట్లను నేరుగా కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకున్నారంట. అంతేకాదు, 1/3వంతు మంది డబ్బు తీసుకోవడమో లేదా మద్యానికి తమ ఓటును ఇచ్చేయడమో చేసినట్లు కూడా ఆ సర్వే వెల్లడించింది. సీఎంఎస్‌ ప్రీ పోస్ట్‌ పోల్‌ అనే పేరిట ఒక స్టడీ చేయగా అందులో ఒక్క యూపీలో ఖర్చయిన డబ్బు వివరాలు తెలిశాయి.

ఒక్కో వ్యక్తికి ఎన్నికల ప్రచారంలో భాగంగా రూ.25లక్షలను ఖర్చుచేసుకోవచ్చని ఎన్నికల కమిషన్‌ చెబితే దాదాపు దానికి రెట్టింపుల కొద్ది డబ్బును ఇతర మార్గాల్లో రహస్యంగా ఖర్చుచేసినట్లు తాజా అధ్యయనంలో తెలిసింది. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, పెద్ద పెద్ద తెరలమీద తమ ప్రచారం చూపించడం, వీడియో వ్యానులు ఉపయోగించడం తదితర పనులకు యూపీ ఎన్నికల్లో రూ.600 నుంచి రూ.900కోట్లు సర్వే తెలిపింది. ఒక్కో ఓటును సగటున రూ.750 పెట్టి కొనుగోలు చేశారంట. ఇప్పటి వరకు సగటున ఒక ఓటుకు చేసిన అతి పెద్ద వ్యయం ఇదేనని సర్వే తెలిపింది.

మరిన్ని వార్తలు