శబరిమలలో మకరజ్యోతి దర్శనం..పోటెత్తిన భక్తులు

14 Jan, 2019 19:02 IST|Sakshi

దర్శనానికి పోటెత్తిన భక్తులు

సాక్షి, శబరిమల : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతిని అయప్పభక్తులు దర్శించుకున్నారు. పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు.‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి.

మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు పెద్దసంఖ్యలో శబరిమల చేరుకున్నారు. సుమారు 18 లక్షల మంది శబరిమలకు వచ్చినట్లు సమాచారం. మకరజ్యోతి దర్శనం నిమిత్తం ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. దర్శనం కోసం పంపా నది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు.  భక్తులు ఈనెల 19వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. ఈనెల 20న పందళ రాజవంశీకులు స్వామివారి దర్శనం తర్వాత ఆలయం మూసివేస్తారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు