శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి

14 Jan, 2015 19:24 IST|Sakshi
శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. అశేష సంఖ్యలో శబరిలో ఉన్న భక్తులతో పాటు.. కోట్లాది మంది భక్తులు టీవీ చానళ్ల ద్వారా కూడా మకరజ్యోతిని దర్శించుకున్నారు. పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనభాగ్యం భక్తులకు కలిగింది.

బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మకరజ్యోతి కనిపించడంతో భక్తుల శరణుఘోషతో శబరి కొండలు ప్రతిధ్వనించాయి. మిరుమిట్లు గొలిపేలా బాణాసంచా కూడా కాల్చి జ్యోతి కనిపించిన ఆనందాన్ని భక్తులు పంచుకున్నారు.

మరిన్ని వార్తలు