లాక్‌డౌన్‌ : రోడ్డుపై అనుకోని అతిథి

27 Mar, 2020 13:43 IST|Sakshi

తిరువనంతపురం : క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌కు చాప కింద నీరులా విస్త‌రిస్తోంది.  భార‌త్‌లోనూ ప్ర‌వేశించిన ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు దేశం వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను ఇంటికి ప‌రిమితం చేసి.. కాలు బ‌య‌ట‌ పెట్ట‌నివ్వ‌డం లేదు. దీంతో ర‌హ‌దారుల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్ల‌పై జ‌న సంచారం లేక‌పోవ‌డంతో దారుల‌న్నీ బోసిపోయాయి. ఈ క్ర‌మంలో అడ‌విలో సంచ‌రించే జంతువులు రహదారిపైకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే కర్ణాట‌క‌లో ఓ అడ‌వి దున్న‌పోతు రోడ్ల‌పైకి వ‌చ్చి స్థానిక‌లను ఆశ్చ‌ర్యప‌రిచిన విష‌యం తెలిసిందే. తాజాగా కేర‌ళ‌లో మ‌రో జంతువు రోడ్డుపైకి వ‌చ్చి ఠీవిగా నడుస్తూ.. ప్రజల కంటపడింది. (నిన్ను కూడా క్వారంటైన్‌కు పంపిస్తారు)

లాక్‌డౌన్‌ నేపథ్యంలోనే కేర‌ళ‌లోని కోజికోడ్‌లో ర‌హ‌దారిపై పోలీసులతో పాటు కొద్దిమంది మాత్ర‌మే ఉన్నారు. ఈ క్ర‌మంలో రోడ్డుపైకి ఓ అనుకొని అతిథి (మ‌ల‌బార్‌ సివెట్) వ‌చ్చింది. (ఇది క్షీర‌ద జాతికి చెందిన‌ది). సాధార‌ణ రోజుల్లో అరుదుగా క‌నిపించే ఈ జంతువు.. రోడ్ల‌న్నీ ఖాళీగా ఉండ‌టంతో వచ్చి స్వేచ్ఛ‌గా సంచ‌రించింది. కాసేప‌టికి రోడ్డు క్రాస్ చేసి వెళ్లిపోయింది. అయితే ఇక్క‌డ ఓ విశేషం ఉంది. ర‌హ‌దారిపై ప్ర‌వేశించిన సివెట్‌.. రోడ్డుపై అడ్డ‌దిడ్డంగా కాకుండా జీబ్రా క్రాసింగ్ వ‌ద్ద రోడ్డు దాటింది. ఈ వీడియోను భారత అటవీశాఖ‌ అధికారి సుశాంత నందా ట్విటర్‌లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌టంతో దీన్ని చూసిన నెటిజ‌న్లు వాహ‌న‌దారురులు కూడా కేవ‌లం జీబ్రా క్రాసింగ్ వ‌ద్దే రోడ్డు దాటాల‌నే సందేశం ఈ వీడియో ఇస్తోంది. అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా