మలేసియాలోనూ ఆధార్‌ తరహా వ్యవస్థ

15 Oct, 2018 06:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీల్లో నకిలీ లబ్ధిదారులు, మోసాలను అరికట్టేందుకు మలేసియా కూడా మన ఆధార్‌ తరహా కార్డులను తమ పౌరులకు జారీచేయాలనుకుంటోంది. ఈ ఏడాది మేలో ప్రధాని నరేంద్ర మోదీ మలేసియాలో పర్యటించినప్పుడు ఈ విషయంలో సాయం చేస్తామని మాటిచ్చారు. దీంతో మలేసియాలో ఆధార్‌ కార్డులను జారీ చేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఆ దేశ మానవ వనరుల మంత్రి కులా సెగారన్‌ నేతృత్వంలోని ఓ బృందం గతవారం భారత్‌లో పర్యటించింది.

మరిన్ని వార్తలు