పురాణాలతో సరిపెడుతున్న మోదీ సర్కార్‌

20 Jul, 2018 18:55 IST|Sakshi
అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రసంగిస్తున్న లోక్‌సభ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌పై లోక్‌సభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మోదీ సర్కార్‌ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. బీజేపీ తరహాలో తాము నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని వ్యాఖ్యానించారు. తాము ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే పాలక పక్షం పురాణాలు చెబుతూ కాలక్షేపం చేసిందని దుయ్యబట్టారు.

బీజేపీ భావజాలం అంబేడ్కర్‌ ఆలోచనలకు వ్యతిరేకమని, బీజేపీ..మోదీ విభజించి, పాలించు సూత్రాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. ఏపీకి ఐదేళ్ల పాటు హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారని, సభలో మన్మోహన్‌ ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందని ఖర్గే ఆరోపించారు. 

మరిన్ని వార్తలు