‘ఈవీఎంల్లో గోల్‌మాల్‌ ’

18 Jun, 2019 15:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలు మోసపూరితమైనవని, ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల్లో 30 శాతం ఈవీఎంల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పనిచేయని ఈవీఎంల స్ధానంలో మార్చిన ఈవీఎంలను ఏ ఒక్కరూ పరీక్షించలేదని అన్నారు. ఆ ఈవీఎంల్లో మాక్‌ పోలింగ్‌ కూడా నిర్వహించకపోవడంతో ఈవీఎంల్లో ఓట్లు ముందస్తుంగా నిక్షిప్తం కాలేదని చెప్పేందుకు ఆధారాలు ఏంటని ఆమె ప్రశ్నించారు.

తాము ఈసీని కలిసి పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలను వాడాలని కోరతామని దీదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్‌ పత్రాలను ప్రవేశపెట్టాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని చెప్పారు. బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చాలనే ప్రయత్నాలను నిలువరిస్తామని, ఈ ఎన్నికలు మోసపూరిత ఎన్నికలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు