మోదీ పిలుపు; నిద్రొస్తే నిద్రపోతా : మమతా 

4 Apr, 2020 12:14 IST|Sakshi

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీ ’లైట్‌ దియా’ పిలుపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యంగా స్పందించారు. ప్రధాని పిలుపును వ్యక్తిగత విషయంగా ఆమె పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తనకు నిద్రొస్తే నిద్రపోతానని చెప్పారు. శుక్రవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ‘‘  ఆయన మీకు చెప్పాడు.. మీరు చెయ్యండి. నన్నెందుకు దాని గురించి అడుగుతున్నారు. నేనేం చేయగలనో నేను చెబుతా.. మోదీ ఏం చేయగలరో ఆయన బెబుతాడు. నేనెందుకు ఇతరుల విషయాల్లో తలదూర్చాలి. కరోనా వైరస్‌ను అడ్డుకోమంటారా లేదా రాజకీయాలు చేయమంటారా? దయచేసి రాజకీయ పోరుకు ఆజ్యం పోయకండి. నరేంద్రమోదీ చెప్పింది మంచిదనిపిస్తే మీరు చెయ్యండి. ఆ టైంలో నాకు నిద్రొస్తే నిద్రపోతా.. అది వ్యక్తిగత విషయం’’ అన్నారు. ( లైట్లనీ ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది )

కాగా, కరోనా చీకట్లను తరిమికొట్టడానికి దేశమంతా ఒక్కటై సంకల్ప బలాన్ని ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్‌ లైట్లు తొమ్మిది నిమిషాల సేపు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు