‘దమ్ముంటే నా సర్కార్‌ను కూల్చండి’

16 Dec, 2019 18:03 IST|Sakshi

కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయనందుకు తన ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. వివాదాస్పద పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. బెంగాల్‌లో పౌర సవరణ చట్టం, ఎన్‌ఆర్సీలను తాను అమలు చేసే ప్రసక్తే లేదని, కేంద్రం తన ప్రభుత్వాన్ని కూలదోయవచ్చని ఆమె సవాల్‌ విసిరారు. మమతా బెనర్జీ ఒంటరి అని వారు అనుకుంటున్నారని, కానీ మీరంతా తన వెంట ఉన్నారని, మన పోరాటం సరైనదైతే ప్రజలంతా వెంట వస్తారని అన్నారు.

తమది మతం ఆధారంగా జరిగే పోరాటం కాదని, సరైన మార్గం కోసం జరిగే పోరాటమని స్పష్టం చేశారు. మరోవైపు మమతా బెనర్జీ మార్చ్‌ను రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్‌ జగ్దీప్‌ ధంకర్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంచే చట్టంగా రూపొందిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీఎం, మంత్రులు నిరసన ర్యాలీ చేపట్టడం రాజ్యాంగవిరుద్ధమని, రెచ్చగొట్టే చర్యని గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు