నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ర్యాలీ

16 Nov, 2016 14:37 IST|Sakshi
నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ర్యాలీ
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలు బుధవారం ర్యాలీ నిర్వహించాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఈ ర్యాలీ చేపట్టాయి. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఈ అంశంపై చర్చించనున్నాయి. కాగా ఈ భారీ ర్యాలీలో శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్, ఎన్సీపీ నేతలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మమత బెనర్జీ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. మరోవైపు విపక్షాల ర్యాలీని బీజేపీ తప్పుబట్టింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమం, చారిత్రతాత్మకమని అభివర్ణించింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని ప‍్రతిపక్షాలు తప్పుపడుతున్న సంగతి తెలిసిందే.
 
 
>
మరిన్ని వార్తలు