అద్వానీతో దీదీ భేటీ

1 Aug, 2018 13:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం పార్లమెంట్‌లో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీతో భేటీ అయ్యారు. వీరు ఇరువురు పలు అంశాలపై చర్చలు జరిపినా ప్రధానంగా అస్సాం ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన పౌరుల ముసాయిదా జాబితా గురించి చర్చించినట్టు సమాచారం. మరోవైపు ఈ జాబితాపై బెంగాల్‌ దీదీ తీవ్రస్ధాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే.

పౌరుల జాబితాలో 40 లక్షల మందిని పక్కనపెట్టడంపై అసోం, మోదీ సర్కార్‌ల తీరును ఆమె ఆక్షేపిస్తున్నారు. అసోం జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సీ) ముసాయిదా విడుదల అంతర్యుద్ధం, రక్తపాతానికి దారితీస్తుందని మమతా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మరోవైపు ఎన్‌ఆర్‌సీ వ్యవహారంపై బుధవారం రాజ్యసభలో పాలక, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళనతో సభ పలుమార్లు వాయిదా పడింది.

మరిన్ని వార్తలు