బెంగాల్‌ను ‘బంగ్లా’గా మార్చండి

19 Sep, 2019 04:51 IST|Sakshi

ప్రధాని మోదీకి సీఎం మమత విజ్ఞప్తి

బెంగాల్‌కు రావాలని ఆహ్వానం

న్యూఢిల్లీ: బెంగాల్‌ సీఎం మమత బుధవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. బెంగాల్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రం పేరు మార్పు, ప్రభుత్వరంగ బ్యాంకులతో సమస్యలపై మోదీతో చర్చించారు. భేటీ తర్వాత మీడియాతో మమత మాట్లాడారు. ‘ప్రధానితో మర్యాదపూర్వకంగానే సమావేశమయ్యా. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన భేటీ. నిరుద్యోగం సహా పలు అంశాలపై మేమిద్దరం చర్చించాం’ అని మమత తెలిపారు.

పేరును ‘బంగ్లా’గా మార్చండి..
పశ్చిమబెంగాల్‌ పేరును ‘బంగ్లా’గా మార్చాలన్న తమ విజ్ఞప్తిని పరిశీలించాలని ఈ సందర్భంగా మమత ప్రధానిని కోరారు. ‘రాష్ట్రం పేరుమార్పుపై కేంద్రం వద్ద సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలనీ, వాటిని తాము స్వాగతిస్తామని మోదీకి చెప్పాను. పశి్చమబెంగాల్‌ పేరును బంగ్లాగా మార్చడం ఇప్పటికీ మా తొలి ప్రాధాన్యతే. ఇందుకు అన్నిరకాలుగా సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు’ అని మమత తెలిపారు.  బిర్భూమ్‌ జిల్లాలో రూ.12,000 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును ఆవిష్కరించేందుకు దుర్గాపూజ తర్వాత బెంగాల్‌కు రావాలని మోదీని మమత బెనర్జీ ఆహా్వనించారు.

ఎన్నార్సీని అమలుచేయబోం..
జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ)ని బెంగాల్‌లో అమలు చేయబోమని మమత స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మమత సమాధానమిస్తూ.. ‘ఎన్నార్సీ అన్నది అస్సాం ఒప్పందానికి సంబంధించిన విషయం. కాబట్టి దీన్ని బెంగాల్‌లో అమలుచేసే ప్రశ్నే తలెత్తదు. ఈ విషయంలో మాముందు ఎలాంటి ప్రతిపాదనలేదు. ఎన్నార్సీని రాష్ట్రంలో అమలుచేయాలన్న ఉద్దేశం కూడా మాకు లేదు’ అని మమత తేలి్చచెప్పారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ–మమత బెనర్జీల మధ్య మాటలయుద్ధం నడిచింది.

>
మరిన్ని వార్తలు