మోదీ.. మీకు ధైర్యముంటే అరెస్ట్ చేయించండి

9 Apr, 2016 18:28 IST|Sakshi
మోదీ.. మీకు ధైర్యముంటే అరెస్ట్ చేయించండి

కోల్కతా: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న మోదీకి ధైర్యముంటే తనను అరెస్టు చేయాల్సిందిగా దీదీ సవాల్ విసిరారు.

గురువారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మూడు ప్రాంతాల్లో మోదీ ప్రసంగిస్తూ టీఎంసీని టెర్రర్, మాత్ (మృత్యు), కరప్షన్ పార్టీ అని సంభోధించారు. కోల్ కతాలో ఫ్లై ఓవర్ 21మంది మృతి చెందిన విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన దీదీ శనివారం అసాన్ సల్ లో జరిగిన ఎన్నికల సభలో బీజేపీనీ భయానక్ జాలీ పార్టీగా పేర్కొన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న మోదీకి ధైర్యముంటే తనను అరెస్టు చేయాల్సిందిగా సవాల్ విసిరారు. తాను మోదీలాగా వ్యక్తిగత విమర్శలు చేయనని అన్నారు. ప్రధాని ఎప్పుడూ విదేశాల్లోనే తిరుగుతూ ఉంటారని ఆయన వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. మన్ కీ బాత్ లో  మాటలు మాట్లాడటం తేలికని పనులు చేయడం నేర్చుకోవాలని మోదీకి సూచించారు.

మరిన్ని వార్తలు