పశ్చిమ బంగ్లాదేశ్‌గా మారబోతుంది!

25 Jun, 2019 19:50 IST|Sakshi

కలకత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోకి చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. ఈ చొరబాట్ల కారణంగా పశ్చిమ బెంగాల్‌ను కాస్తా ‘పశ్చిమ బంగ్లాదేశ్‌’గా మార్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో బెంగాల్‌, బంగ్లాదేశ్‌ను కలిపి పశ్చిమ బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.

భారతదేశం నుంచి బెంగాల్‌ను దూరం చేయాలని ఆమె కుట్రకు పాల్పడుతోందన్నారు. సోమవారం భట్‌పారా అల్లర్లలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన.. టీఎంసీ బెంగాల్‌ను మరో పాకిస్తాన్‌గా మార్చాలనుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భట్‌పారా అల్లర్ల సమస్యకు పరిష్కారం చూపడం లేదన్నారు. ఇక్కడి బాధితులకు న్యాయం జరిగే  పరిస్థితులు కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడానికి బీజేపి ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి గూండాలను తీసుకువస్తోందని కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై ఘోష్‌ స్పందిస్తూ.. బెంగాల్‌ను  పాకిస్తాన్‌గా మర్చే ఉద్దేశంతో ‘జై శ్రీరామ్‌ నినాదాలను’ రాష్ట్రంలో అనుమతించడం లేదన్నారు.  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 పార్లమెంట్‌ స్థానాల్లో.. 18 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తృణమూల్‌ కాంగ్రెస్‌ 22 స్థానాలను గెలుచుకొని కొంత బలాన్ని కోల్పోయిన సంగతి విదితమే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోడలికి కొత్త జీవితం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

జాధవ్‌ కేసుపై ఐసీజే తీర్పు నేడే 

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

పాక్‌ మీదుగా రయ్‌రయ్‌

మంచి రోడ్లు కావాలంటే టోల్‌ ఫీజు కట్టాల్సిందే 

కూలిన బతుకులు

మావోలకు వెరవని గిరిజన యువతి

బీజేపీలో చేరిన మాజీ ప్రధాని కుమారుడు

‘మరో కార్గిల్‌ వార్‌కు రెఢీ’

‘నా కల నిజమైంది.. మళ్లీ ఆశలు చిగురించాయి’

ఈనాటి ముఖ్యాంశాలు

జయప్రద వర్సెస్‌ డింపుల్!

టిక్‌ టాక్‌: మహిళా పోలీసుల స్టెప్పులు.. వైరల్‌

యువతికి రాంచీ కోర్టు వినూత్న శిక్ష

భారీ వర్ష సూచన.. రెడ్‌అలర్ట్‌ ప్రకటన

విమాన ప్రయాణీకులకు భారీ ఊరట

‘వాళ్లు పుస్తకం ఎలా కొంటారు’

అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి

ఫేక్‌న్యూస్‌ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి

‘మళ్లీ సోనియాకే పార్టీ పగ్గాలు’

కుప్పకూలిన భవనం : శిథిలాల కింద..

ఐఏఎఫ్‌లో చేరనున్న అమర జవాన్‌ భార్య

కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం

ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ

14 మంది ఉగ్రవాదులకు రిమాండ్‌

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ అరెస్ట్‌

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ‘ఆధార్‌’ ఆపేశాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం