అక్రమ చొరబాటు.. హెలికాప్టర్‌ ధ్వంసం..!

3 Feb, 2020 16:13 IST|Sakshi

భోపాల్‌ : భోపాల్‌లోని రాజభోజ్‌ విమానాశ్రయంలో ఆదివారం కలకలం రేగింది. ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టులోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా.. ప్రైవేటు హెలికాప్టర్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానం ముందు బైఠాయించాడు. వెంటనే స్పందించిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) అతన్ని అదుపులోకి తీసుకుని.. స్థానిక పోలీసులకు అప్పగించింది. ఆగంతకుణ్ణి యోగేశ్‌ త్రిపాఠీ (20)గా గుర్తించారు.

యోగేశ్‌ దాడి చేసిన హెలికాప్టర్‌ రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌కు చెందినది కావడం గమనార్హం. రాళ్లతో దాడి చేయడంతో హెలికాప్టర్‌ ముందు భాగం ధ్వంసమైంది. యోగేశ్‌ ఏ ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా అతను మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని సమాచారం. ఇక ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఉద్రిక్తత నేపథ్యంలో..  ఉదయ్‌పూర్‌కు వెళ్లాల్సిన స్పైస్‌ జెట్‌ విమానం గంట ఆలస్యంగా నడిచిందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు