వీళ్లు.. మనుషులా.. రాక్షసులా?

20 Mar, 2016 14:52 IST|Sakshi
వీళ్లు.. మనుషులా.. రాక్షసులా?

అలీగఢ్‌: పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాడనే నెపంతో ఓ వ్యక్తిని చితక్కొట్టారు. ఏమాత్రం జాలి, కరుణ దయ లేకుండా నిర్ధాక్షిణ్యంగా కిందపడేసి చావు దెబ్బలు కొట్టారు. ఇంత జరుగుతున్న అక్కడ చుట్టూఉన్నవారంతా తాఫీగా ప్రేక్షకులుగా చూస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూసిన ఈ వీడియో పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ వీడియోలో చూపించిన ప్రకారం ఓ యువకుడిని ముందుగా కిందపడేశారు. మరో వ్యక్తి అతడిని కదలకుండా పట్టుకోగా ఓ వ్యక్తి చేతిలో పెద్ద కర్ర తీసుకొని గొడ్డును బాదినట్లు బాదాడు. ఆ తర్వాత ఓ రాయి తీసుకొచ్చి కాళ్లపైన, ముఖంపైన అదే పనిగా దాడి చేశాడు. దీంతో ఆ యువకుడు సొమ్మసిల్లిపోయాడు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు