మహిళా ఎంపీపై అభ్యంతరకర ట్వీట్లు‌, కేసు నమోదు

22 Nov, 2017 16:34 IST|Sakshi

థానే : ఎన్‌సీపీ ఎంపీ సుప్రియ సూలేకి వ్యతిరేకంగా మైక్రో-బ్లాగింగ్‌ సైటులో అభ్యంతరకర ట్వీట్లు పోస్టు చేయడంతో ఓ ట్విట్టర్‌ యూజర్‌పై కేసు నమోదైంది. ఎన్‌సీపీ ఎంఎల్‌ఏ జితేంద్ర అవధ్ద్ నమోదుచేసిన ఫిర్యాదు మేరకు వర్తక్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు రిజిస్ట్రర్‌ అయింది. ఎన్‌సీపీ నేత సుప్రియ సూలేపై ఓ ట్విట్టర్‌ యూజర్‌ అభ్యంతరకర పోస్టులు చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు. ఐపీసీ సెక్షన్స్‌ 354(డీ), 509(పదం, సంజ్ఞ లేదా చట్టం ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా ఒక మహిళ వినయాన్ని అవమానపరచడం), 500(పరువునష్టం), ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 67 కింద ఈ విషయంపై పోలీసులు కేసు నమోదుచేశారు.

ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌పై నిందితుడు అభ్యంతరకర ట్వీట్లను పోస్టు చేసినట్టు ఫిర్యాదులో అవద్ద్‌ చెప్పారు. సూలేకి వ్యతిరేకంగా చేసిన ఈ ట్వీట్ల వల్ల ఎన్‌సీపీ నేతల మనోభావాలు దెబ్బతిన్నాయని లిజిస్లేటర్‌ పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు సూలే కూతురు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని బారమతి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు