కడుపు తరుక్కుపోయే ఘటన

16 Apr, 2018 16:59 IST|Sakshi
బాధితురాలి ఫొటో

షాజహాన్‌పూర్‌: కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టాడు. సాటి మనిషి అన్న సానుభూతి కూడా చూపించకుండా ఆమె చేతులను సీలింగ్‌ ఫ్యాన్‌కు కట్టేసి బెల్టుతో విచక్షణా రహితంగా బాదాడు. అంతటితో వూరుకోకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి తన అత్తింటివారికి పంపాడు. తాను అడిగిన కట్నం ఇవ్వకపోతే మరింత హింసిస్తానని బెదిరించాడు. కడుపు తరుక్కుపోయే ఈ సంఘటన యూపీలోని షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. పుట్టింటికి వెళ్లి రూ. 50వేలు కట్నం తీసుకురమ్మని ఆమెను భర్త ఒత్తిడి చేశాడు. బాధితురాలు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెను బెల్టుతో నాలుగు గంటలపాటు విచక్షణారహితంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక బాధితురాలు స్పృహ కోల్పోయింది. మెలకువ వచ్చేసరికి తన రెండు చేతులను చున్నితో సీలింగ్‌ ఫ్యాన్‌కు కట్టేశాడని బాధితురాలు తన బాధను మీడియాతో పంచుకుంది. తాను చదువుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందని, తన జీవితం నాశనమైపోయిందని ఆమె వాపోయింది.

ఈ విషయం గురించి షాజహాన్‌పూర్‌ సర్కిల్‌ ఆఫీసర్‌ సుమిత్‌ శుక్లా మాట్లాడుతూ.. బాధితురాలి భర్త ఏ మాత్రం కనికరం లేకుండా తన భార్యను కొడుతున్న వీడియోను తాము చూశామన్నారు. వీడియోను పరిశీలించిన తర్వాత బాధితురాలి భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు మరో నలుగురి మీద వరకట్న నిషేధం చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం: లుంగీ కట్టుకున్నారని దాడి

మీటూ ప్రకంపనలు : ఆ మం‍త్రి చేష్టలతో అవాక్కయ్యా..

శబరిమల వివాదం : హిందూ సంఘాలపై స్వామి ఫైర్‌

శబరిమలలో భారీ భద్రత

‘నాన్న నేను కిడ్నాప్‌ అయ్యా.. 5 లక్షలు పంపు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీటూ : తండ్రి మీద ఆరోపణలు.. బాధితులకే మద్దతంటున్న నటి

పిరియాడిక్‌ డ్రామాలో సూపర్‌ స్టార్‌..!

నాని కొత్త సినిమా మొదలైంది

నేనంటే హడల్‌!

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ని ద‌త్త‌త తీసుకున్న ప్ర‌ణీత

ఎక్కువ చిత్రాలు చేయాలనే ఉంది