లైఫ్‌లో గుర్తుండిపోయే పెళ్లి చేసుకోవాల‌నుకున్నా

30 Apr, 2020 15:29 IST|Sakshi

ఒంట‌రిగా వివాహం చేసుకున్న జంట‌

వ‌ధువు కోసం 100 కి.మీ. సైకిల్ తొక్కిన వ‌రుడు

లక్నో: క‌ళ్యాణ‌మొచ్చినా క‌క్కొచ్చినా ఆగ‌దంటారు. ఇక్క‌డ చెప్పుకునే జంట విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. మా పెళ్లిని ఆప‌డం క‌రోనా త‌రం కూడా కాదంటూ శ‌ప‌థం చేసిందీ ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన ఓ జంట‌. హ‌మీర్‌పుర్‌లోని పౌతియా గ్రామానికి చెందిన క‌ల్కు ప్ర‌జాపతికి మ‌హోబా జిల్లాలోని పునియా గ్రామానికి చెందిన రింకీకి వివాహం నిశ్చ‌య‌మైంది. ఇంత‌లో పెళ్లికి వీల్లేదంటూ లాక్‌డౌన్ వ‌చ్చిప‌డింది. అలా అని చెప్పి వాళ్లు పెళ్లిని వాయిదా వేసుకోలేదు. ఒంటరిగానైనా స‌రే వివాహం జ‌రగాల్సిందేన‌ని భీష్మించుకున్నాడు. ఇంకేముందీ త‌న సైకిల్‌ను బ‌య‌ట‌కు తీశాడు. త‌ను మ‌నువాడే యువ‌తి కోసం క‌లలు కంటూ ఏప్రిల్ 27న సైకిల్ తొక్కుతూ ప‌య‌నం ప్రారంభించాడు. (కొత్త జంట‌కు క‌రోనా; గ్రామానికి సీల్‌)

ఇలా జ‌రుగుతుంద‌నుకోలేదు
వంద కిలోమీట‌ర్లు తొక్కుకుంటూ వెళ్లగా ఏప్రిల్ 28 నాటికి వ‌ధువు గ్రామానికి చేరుకున్నాడు. ఇంకేముందీ.. అప్ప‌టివ‌ర‌కు ప‌డ్డ క‌ష్టాన్ని మ‌రిచి అక్క‌డే బాబా ధ్యానిదాస్ ఆశ్ర‌మంలో పెళ్లి చేసుకున్నాడు. అనంత‌రం బుధ‌వారం నాడు అదే సైకిల్‌పై కొత్త జంట వరుడి ఇంటికి చేరుకుంది. ఈ పెళ్లి గురించి క‌ల్కు మాట్లాడుతూ.. "నా పెళ్లి క‌ల‌కాలం గుర్తుండిపోయేలా చేసుకోవాల‌నుకున్నాను. కానీ ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య ఈ విధంగా జ‌రుగుతుంద‌నుకోలేదు" అని పేర్కొన్నాడు. (క‌రోనా: ‌అప్పుడు మాకు దిక్కెవ‌రు?)

>
మరిన్ని వార్తలు