వీధి పిల్లికి చేతులతో నీళ్లు పట్టిన వైనం

29 May, 2020 11:27 IST|Sakshi
వీడియో దృశ్యాలు

మనం చేసేది చిన్న సహాయమైనా అది ఎదుటి వ్యక్తికి ఎంతో ఊరట కలిగిస్తుంది. మనం చేసే ఆ సహాయం మన మంచి మనసును ప్రతిబింబించటమే కాదు, అది విశ్వ జనీనమైనదైనప్పుడు మానవత్వపు పరిమళాలు నలువైపులా చేరుకుంటాయి. ఇలాంటి సంఘటనే ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వీధి పిల్లికి సహాయం చేసి ఓ వ్యక్తి మానవత్వానిక కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు. దాహంతో అల్లాడుతున్న పిల్లికి తన చేతులతో నీళ్లు పట్టి, సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయాడు. ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్‌ నంద ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆయన స్పందిస్తూ.. ‘‘  నిజమైన సంతోషం చిన్న చిన్న విషయాల్లోనే లభిస్తుంది. వీధి పిల్లికి నీళ్లు తాగించటం ద్వారా అతడికి స్వచ్ఛమైన ఆనందం’’  అని పేర్కొన్నారు.  ( ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదు)

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వేల కొద్ది వీక్షణలు, రీ ట్వీట్లతో దూసుకుపోతోంది. దీనిపై నెటిజన్లు.. ‘‘ మానవత్వాన్ని చూడటం గర్వంగా ఉంది.. అతను ఎంతో దయ కలవాడు..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  ఈ వీడియోలో... దాహంతో ఉన్న పిల్లికి ఓ వ్యక్తి కొళాయి నీళ్లను తన దోసిడితో పట్టి తాగించాడు. పిల్లి కూడా ఆ మనిషిని చూసి భయపడకుండా తన దాహం తీరే వరకు నీళ్లు తాగింది. ( ఆస్ప‌త్రిలో ఒక్క‌టైన డాక్ట‌ర్, న‌ర్స్‌ )

>
మరిన్ని వార్తలు