భార్యను చావబాది.. తలను రంపంతో కోసి..

15 Feb, 2017 08:35 IST|Sakshi
భార్యను చావబాది.. తలను రంపంతో కోసి..

న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు ఢిల్లీ నగరమంతా కాస్తంత సంబరాల మధ్య ఉండగా నగర పోలీసులు మాత్రం ఓ అవాక్కయ్యే కేసును పట్టుకున్నారు. కట్టుకున్న భార్యను కడతేర్చి కసాయిగా ఆమె తలను మొండేన్ని వేరు చేసిన భర్తను అరెస్టు చేశారు. అత్యంత భయంకరమైన ఈ ఘటన మూడు రోజుల కిందే జరిగింది. తన భార్యను చంపేసిన ఆ వ్యక్తి మూడు రోజులపాటు ఆమె మృతదేహంతోనే కలిసి ఉన్నాడు. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని మధు విహార్‌ అనే ప్రాంతంలో సుబోధ్‌ కుమార్‌ (40) అనే వ్యక్తి మనీషా భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇటీవలె భార్యకు తెలియకుండా అతడు రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మునియా. రెండు ఫ్యామిలీలు నడపాలన్న కుట్ర చేసినా చివరికి అది బయటపడటంతో సుబోధ్‌ను భార్య మనీషా నిలదీసింది. ఈ విషయంపై ఇటీవల తరుచు వారిమధ్య గొడవలు జరిగాయి. దీంతో తనకు విడాకులు ఇవ్వాలంటూ భార్య సుబోధను అడిగింది. అయితే, తాను చెప్పినట్లు పడుండాలంటూ అతడు గొడవపడ్డాడు. పిల్లలను ముందుగానే తన అత్తమామ వద్దకు పంపించి తన భార్యను చంపే కుట్ర రచించాడు. శనివారం రాత్రి ఆమెపై పైపు దాడి చేసి పదేపదే తలపై కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది.

మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లే వీలుకాక రంపాన్ని తెచ్చి ఆమె తలను శరీరం నుంచి వేరు చేశాడు. ఆయా సంచుల్లో ఆమె దేహాన్ని ముక్కలు చేసేందుకు సిద్దమయ్యాడు. అయితే, అప్పటికే మూడు రోజులు కావడంతో దుర్గంధం వచ్చి చుట్టుపక్కల వారు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం తెలిసింది. తాను నేరం చేసినట్లు అతడు అంగీకరించాడు. అయితే, అతడి రెండో భార్య మునియా హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు