రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

2 Aug, 2019 11:44 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ట్రిపుల్‌ తలాక్‌-2019 చట్టం కింద కేసు నమోదైంది. వరకట్నం ఇవ్వడం లేదని ఓ వ్యక్తి భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. అత్తింటివారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కోసి ప్రాంతానికి చెందిన జుమిరాత్‌, మేవత్‌కు చెందిన ఇక్రమ్‌కు కొద్దినెలల క్రితం వివాహమైంది. అయితే, కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో గురువారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. వరకట్నం కింద లక్ష రూపాయలు చెల్లిస్తేనే జుమిరాత్‌ను ఏలుకుంటానని ఇక్రమ్‌ తేల్చిచెప్పాడు.
(చదవండి : తలాక్‌ తలాక్‌ తలాక్‌ అంటే.. ఇకపై నేరమే)

అత్తింటివారు నిరాకరించడంతో.. నడిరోడ్డుపైనే మూడుసార్లు తలాక్‌ చెప్పాడు. భార్యతో తనకు ఏ సంబంధం లేదని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కాగా, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం -2019 ప్రకారం ఇక్రమ్‌పై కేసు నమోదు చేశామని మథుర ఎస్పీ షాలాబ్‌ మాథుర్‌ చెప్పారు. ఈ చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ క్రిమినల్‌ చర్యగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయిన పక్షంలో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష పడనుంది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిందని ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మీ అవసరం లేదు.. పాక్‌తోనే తేల్చుకుంటాం’

రవీష్‌ కుమార్‌కు రామన్‌ మెగసెసే అవార్డు

టబ్‌లో చిన్నారి; సెల్యూట్‌ సార్‌!

మేఘాలను మథిస్తారా?

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఖర్గే!

ఇక ఢిల్లీలో ‘ఉన్నావ్‌’ విచారణ

జాధవ్‌ను కలుసుకోవచ్చు!

23 నిమిషాల్లో ముంబై టు పుణె

పోక్సో బిల్లుకు పార్లమెంటు ఓకే

‘మెడికల్‌’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

డూడుల్‌ గీయండి... లక్షలు పట్టండి

మేం భారతీయులమే.. మా కాలనీ పేరుమార్చండి! 

మిస్టర్‌ పీఎం.. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది

నాగపుష్పం కాదు.. అంతా ఉత్తిదే!

అక్కడ నవ్వడమా? సిగ్గుచేటు!

ఈనాటి ముఖ్యాంశాలు

ఆహారానికి మతం లేదన్నారు.. మరి ఇదేంటి..!

శ్రీనగర్‌ను ముంచెత్తిన వర్షం!

మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అరెస్టు

కిడ్నీ జబ్బును గుర్తించే ‘యాప్‌’

అప్పు కట్టలేక భార్య,కూతుర్ని చంపించి..

ముప్పు ఉందని ముందే పసిగట్టాడు

కులభూషణ్‌ జాధవ్‌ కేసు: పాక్‌ కీలక నిర్ణయం

మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే!

తలాక్‌ తలాక్‌ తలాక్‌ అంటే.. ఇకపై నేరమే

సిద్ధార్థ ఆత్మహత్యకు కారణాలు ఏమిటీ?

ఆమె.. లేటెస్ట్‌ ఫేస్‌బుక్‌ సెన్సేషన్!

ఉన్నావ్‌ ఘటన : సుప్రీం కీలక ఆదేశాలు

చేతులెత్తేసిన ప్రతిపక్షం 

సెంగార్‌పై వేటు వేసిన బీజేపీ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌