సీపీఐ లీడర్ చెంప చెళ్లుమనిపించాడు!

27 May, 2016 09:20 IST|Sakshi

మిడ్నాపూర్: నివాసంలో పుర్రెను ఉంచుకుని దొరికిపోయిన సీపీఐ లీడర్ సుశాంత్ ఘోష్‌ను కోర్టు ప్రాంగణంలో ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించాడు. ఆ పుర్రె తన బిడ్డదేనని ఆయన తెలిపారు. కోర్టులో విచారణకు హాజరైన ఘోష్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో లోపలికి వచ్చిన మనోరంజన్ సింగ్ అనే వ్యక్తి ఘోష్ ఎడమ చెంపపై కొట్టారు. ఆ పుర్రె తన బిడ్డ స్వపన్ సింగ్‌దని, కొన్నేళ్ల కిందట మిస్ అయిందని తెలిపారు.

ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు వెంటనే సింగ్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటనతో షాక్ తిన్న ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు. 2011లో ఘోష్ పూర్వీకులకు సంబంధించిన ఇంటి నుంచి మొత్తం 8 పుర్రెలను పోలీసులు సీజ్ చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు వెళ్లిన ఘోష్ బెయిల్ తెచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు