ఎయిర్‌పోర్టులోకి అక్రమంగా ప్రవేశం.. అరెస్ట్‌

9 Sep, 2019 14:21 IST|Sakshi

న్యూఢిల్లీ : విమానాశ్రయంలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. విమానాశ్రయంలోని టెర్మినల్‌ 3 వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడాన్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ...తన పేరు ఉబైద్‌ లాల్‌ అని, శ్రీనగర్‌కు వెళ్తున్న తన తల్లిని చూడటానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. టెర్మినల్‌ 3 లోకి ఎలా ప్రవేశించావని పోలీసులు ప్రశ్నించగా అతను సవరించిన విమాన టికెట్‌ను చూపించి లోనికి ప్రవేశించినట్లు చెప్పుకొచ్చాడు.

దీంతో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఉబైద్‌ లాల్‌ను ఢిల్లీ పోలీసులకు అప్పగించి...  అతనిపై మోసం, నేరపూరిత దుర్వినియోగం కేసు నమోదు చేశారు. కాగా రద్దు అయిన టికెట్‌ను చూపించి టెర్మినల్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని అంతకు మందే సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రిటిష్‌ జాతీయుడైన రాజ్‌ధనోటా రద్దు అయిన టికెట్‌ను చూపించి టెర్మినల్‌ లోపలికి వచ్చేశాడు. అతను తన భార్య, కుమారుడిని చూడటానికే ఇలా చేశానని విచారణలో ఒప్పుకున్నాడు. అతనిపైన కూడా కేసు నమోదు చేశారు. ఒకే రోజు రెండు సంఘటనలు జరగడంతో విమనాశ్రయంలో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు.
చదవండి : విమానంలోనే తుది శ్వాస విడిచిన ప్రయాణికుడు

మరిన్ని వార్తలు