ప్రేమించిన, కుదిర్చిన అమ్మాయిలను ఒకేసారి..!

10 Jul, 2020 20:10 IST|Sakshi

భోపాల్‌ : సాధారణంగా ఇప్పటి వరకు ప్రేమ పెళ్లిళ్లు చూశాము. పెద్దలు  కుదిర్చిన వివాహాలూ చూశాము. మరి ప్రేమించిన అమ్మాయిని, పెద్దలు చూసిన అమ్మాయిని ఇద్దరిని పెళ్లి చేసుకున్న వింత వివాహాన్ని చూశారా. అది కూడా ఒకే సమయం, ఒకే మండపంలో. ఇదేంటి అని ఆశ్చర్యపోకండి. అచ్చం ఇదే సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. బెతుల్‌ జిల్లాకు చెందిన సందీప్‌ అనే వ్యక్తి చదువుల నిమిత్తం భోపాల్‌కు వెళ్లాడు. అక్కడ ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా చిగురించింది. ఇదిలా కొనసాగుతుండగా, మరోవైపు సందీప్‌కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న తల్లిదండ్రులు అతని కోసం అమ్మాయిని చూశారు. (ఫాదర్‌ పాలు దొంగిలించిన పిల్లి)

ఈ విషయాన్ని కొడుకు సందీప్‌కు తెలియజేయగా, అతను మరో అ‍మ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిపాడు. దీంతో ఏం చేయాలో తోచక ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులు ఊరి పంచాయితీకి తీసుకెళ్లారు. అక్కడ పంచాయితీ పెద్దలు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. ఇద్దరు అమ్మాయిలు కలిసి యువకునితో కలిసి జీవించాలని అనుకుంటే ఇద్దరిని సందీప్‌ పెళ్లి చేసుకోవచ్చని పంచాయితీ పెద్దలు తీర్పిచ్చారు. ఇందుకు యువతిలు ఇద్దరూ అంగీకరించడంతో జూలై 8న కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో సందీప్‌తో ఏడడుగులు వేసి వివాహా బంధంతో ఒకటయ్యారు. కాగా ఈ విచిత్ర వివాహం వైరల్‌ అవ్వడంతో అనేకమంది నెటిజన్లు పెళ్లిళ్లు ఇలా కూడా జరుగుతాయా అని నోరెళ్లబెడుతున్నారు. (టిక్‌టాక్‌ 2.0: టిక్‌టాక్‌ కాపీగా ‘ టకా టక్‌’)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా