ఆ రెండు ఏనుగులే నా కుటుంబం

12 Jun, 2020 10:03 IST|Sakshi
అక్తర్‌ ఇమామ్‌

పాట్నా : తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు ఏనుగుల పేరిట ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని రాసేశాడో వ్యక్తి. ఈ సంఘటన బిహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫుల్‌వారీషరీఫ్‌, జానిపుర్‌ గ్రామానికి చెందిన అక్తర్‌ ఇమామ్‌కి చిన్నప్పటినుంచి ఏనుగులంటే ప్రాణం. అందుకే 12 ఏళ్ల వయసునుంచే వాటిని సంరక్షించటం మొదలు పెట్టాడు. 15 ఏళ్ల క్రితం ‘ఐరావత్‌’ పేరిట ఓ ఎన్జీఓ సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం అతడి దగ్గర మోతీ, రాణి అనే రెండు ఏనుగులు ఉన్నాయి. వాటి పేర దాదాపు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని వీలునామా రాసేశారు ఇమామ్‌. వాటికి ఎలాంటి హానీ కలగకుం‍డా ప్రాణపదంగా చూసుకుంటున్నారు. ( సింహం ఘటనపై దేశాధ్యక్షుడి ఆగ్రహం! )

ఇమామ్‌ మాట్లాడుతూ.. ‘‘ నేను ఏనుగుల పేరిట కోట్ల ఆస్తి రాయటం పిచ్చి నిర్ణయం కాదు. మోతీ,రాణిలు నా ప్రాణాలు కాపాడాయి. అవే నా నిజమైన కుటుంబం. వాటిని సంరక్షించటం నా కెంతో ఇష్టం. నా ప్రాణాలకు ప్రస్తుతం ప్రమాదం ఉంది. వేటగాళ్లు, ఏనుగుల స్వగ్లర్ల నుంచి ముప్పు ఉంది. అందుకే నా ఆస్తిని వాటి పేరిట రాసేశాను. నేను చనిపోయినా అవి సంతోషంగా బ్రతుకుతాయి.  అవి చనిపోయిన తర్వాత నా కుటుంబానికి కూడా ఆ ఆస్తి చెందదు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్జీఓకు బదిలీ అవుతుంది. నేను ఇదివరకే నాకు చెందిన పెద్దల ఆస్తిలో నా అక్కాచెల్లెళ్లకు, మాజీ భార్యకు, ముగ్గురు కుమారులకు వాటా పంచాను’’ అన్నారు. ( ఏనుగు మృతి: ప్రమాదవశాత్తూ జరిగిందేమో! )

అలా నా ప్రాణాలు కాపాడాయి
కొన్ని సంవత్సరాల క్రితం ఓ పనిమీద ఆరా సిటీకి వెళ్లాను. మోతీని కూడా వెంటతీసుకెళ్లాను. అర్థరాత్రి నేను గదిలో నిద్రలో ఉండగా మోతీ అరుపులు వినిపించాయి. వెంటనే కిటికీలోంచి బయటకు చూశాను. సంకెళ్లు తెంచుకున్న మోతీ తుపాకులతో ఉన్న దుండగులను తరుముతోంది.

మరిన్ని వార్తలు