రాజీనామాకు ససేమిరా అంటున్న మాంఝీ

6 Feb, 2015 11:25 IST|Sakshi
రాజీనామాకు ససేమిరా అంటున్న మాంఝీ

పాట్నా : బీహార్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా జేడీ(యూ)  పార్టీ నాయకత్వంపై ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్తో శనివారం ఎమ్మెల్యేల భేటీపై మాంఝీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన నేడు సమావేశం కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు మాంఝీ యత్నిస్తున్నారు. అంతేకాకుండా సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మాంఝీ స్పష్టం చేశారు.

మరోవైపు బీహార్ సీఎం మార్పుపై జేడీ (యూ)లో ముమ్మర కసరత్తు జరుగుతోంది.  నితీష్ కుమార్ సీఎం పదవి చేపట్టేందుకు వీలుగా ప్రస్తుత సీఎం జితన్ రామ్ మాంఝీని పదవి నుంచి తప్పించనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నెల7న జేడీ(యూ) శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశం అనధికారకంగా జరుగుతోందని, తాను రాజీనామా చేసే అవకాశం లేదని మాంఝీ ఇప్పటికే ప్రకటించారు.

మరిన్ని వార్తలు