'రిజర్వేషన్ను వదులుకుంటున్నా.. ఇక జనరల్గానే '

21 Mar, 2016 16:31 IST|Sakshi
'రిజర్వేషన్ను వదులుకుంటున్నా.. ఇక జనరల్గానే '

పాట్నా: తాను రాజకీయాల్లో పోటీచేసేందుకు రిజర్వేషన్ ఉపయోగించుకోనని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామీ మోర్చా(హెచ్ఏఎం) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ రిజర్వేషన్ ఆధారంగా ఎన్నికల్లో పోటీచేయబోమని, జనరల్ స్థానాల నుంచే పోటీ చేస్తామని చెప్పారు.

'రిజర్వేషన్ లబ్ధిని పొందకూడదని మేం నిర్ణయించుకున్నాం. మాలో ఎవరు బలహీనమైనవారు ఉన్నారో వారే దానిని పొందడానికి అర్హులు అని మాంఝీ చెప్పాడు. మాంఝీ మహాదళిత్ కులానికి చెందిన వ్యక్తి. ఆయన ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో రిజర్వేషన్ సీటు నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనే స్వయగా రిజర్వేషన్ అనేది నిజంగా అభివృద్ధి చెందని వారికి దక్కాల్సినదని, అందుకే తాను రిజర్వేషన్ నుంచి పక్కకు జరిగి జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పాడు. బలహీన వర్గాల్లో ఉన్నతులుగా మారినవారు తమ ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో తమ రిజర్వేషన్లను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఓ ఆరెస్సెస్ నేత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు