మీడియా అంటే భయపడే ప్రధానిని కాదు : మన్మోహన్‌

19 Dec, 2018 11:24 IST|Sakshi

న్యూఢిల్లీ : మీడియాతో మాట్లడాలంటే నాకేం భయం లేదు. అలా అనుకున్న వారందరికి నా పుస్తకం సమాధానం చెప్తుందన్నారు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌. తన పుస్తకం ‘చేంజింగ్‌ ఇండియా’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జనాలు నన్ను సైలెంట్‌ ప్రధానమంత్రిగా భావిస్తారు. ఇప్పుడు ఈ పుస్తకం వారికి సమాధానం చెప్తుందని భావిస్తున్నాను. మీడియా అంటే భయపడే ప్రధానిని కాదు. విదేశి పర్యటనల సమయంలో నేను తప్పకుండా ప్రెస్‌ని కలిసేవాడిని. తిరిగి వచ్చాక కూడా మీడియా సమావేశం నిర్వహించేవాడిన’ని తెలిపారు. అంతేకాక ‘నేను కేవలం యాక్సిడెంటల్‌ ప్రధానిని మాత్రమే కాదు.. యాక్సిడెంటల్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌ కూడా అంటూ మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మన్మోహన్‌ను ఉద్దేశిస్తూ సైలెంట్‌ పీఎం.. మీడియాతో మాట్లడాలంటే భయం అని విమర్శిచింన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మన్మోహన్‌ ఇలాంటి కామెంట్‌ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మన్మోహన్‌ సింగ్‌ను ఉద్దేశిస్తూ.. మౌని మోహన్‌ సింగ్‌ అంటూ ఎద్దేవా చేశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. రాహుల్‌ గాంధీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘మోదీ ప్రచారం కూడా ముగిసింది. ఇక ఇప్పుడు మీరు మీ పూర్వ బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నాను. మీరు ప్రధాని అయ్యి ఇప్పటికి 1,654 రోజులు పూర్తయ్యాయి. కానీ ఇంతవరకూ ఒక్క ప్రెస్‌ కాన్ఫరేన్స్‌ కూడా నిర్వహించలేదు. హైదరాబాద్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను చూశాను. మరో సారి ప్రయత్నించండి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు చాలా సరదగా ఉంటుందంటూ’ ఈ నెల 5న రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు