మార్ఫింగ్‌ చేశాడని.. అరగుండు

17 Nov, 2018 16:44 IST|Sakshi
అరగుండుతో వఖీల్

అలీగఢ్‌: అమ్మాయిలను వేధిస్తూ వారి ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడన్న ఆరోపణలతో ఓ యువకున్ని చితకబాది, అరగుండు చేసిన ఘటన యూపీలోని సహారాఖుడ్‌ అనే గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఈ నెల 5న వఖీల్‌ అనే యువకున్ని కొందరు స్థానికులు కొట్టి, అరగుండు గీయించి ఊరేగించిన తర్వాత పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌ అయింది. వఖీల్‌ కుటుంబ సభ్యులు ఆ వీడియోను తీసుకొని వెళ్లి జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ చంద్రభూషణ్‌ మాట్లాడుతూ.. ‘వీడియోలో ఓ యువకున్ని కొట్టి గుండు గీయించిన సంఘటన ఉందని, దీని గురించి విచారణ చేపట్టాల్సిందిగా ఇన్‌స్పెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామ’ని అన్నారు. 

దీనిపై ఇబ్రహీం హుస్సేన్‌ అనే సామాజిక కార్యకర్త స్పందిస్తూ వఖీల్‌ అమాయకుడని, ఎవరో అతని ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేసి ఈ పని చేశారని అన్నారు. కొంతమంది వఖీల్‌ను ఇంట్లో నుంచి కొట్టుకుంటూ ఓ కాలువ దగ్గరకి తీసుకెళ్లారని, నిజానికి అతన్ని అక్కడే చంపాలనుకున్నారని కానీ అదృష్టవశాత్తూ వేరే వారు ఆపడంతో ప్రాణాలతో మిగిలాడన్నారు. దాడి చేసిన అల్లరి మూకలు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే వఖీల్‌ జైల్‌లో ఉన్నాడన్నారు. అతడికి ఇప్పటికీ ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా కట్టడికి కేజ్రీవాల్‌ 5టీ ప్లాన్‌

కరోనా కట్టడికి సోనియా 5 సూచనలు

ఏప్రిల్‌ 15 నుంచి లాక్‌డౌన్‌ పాక్షిక ఎత్తివేత!

టిక్‌టాక్‌ను తీసేస్తున్నారు!

క్వారంటైన్‌లోకి సీఎం భద్రతా సిబ్బంది

సినిమా

కరోనా క్రైసిస్‌: పోసాని గొప్ప మనుసు

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం